- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నీ అందాన్ని మా సినిమా ప్రమోషన్స్ కోసం వాడు’.. నేషనల్ క్రష్‌కు కంగనా రిక్వెస్ట్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తనదైన శైలిలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తనదైన శైలిలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) ప్రమోషన్స్‌లో భాగంగా, తన కో-స్టార్, ‘నెక్స్ట్ నేషనల్ క్రష్’ గిరిజా ఓక్ (Girija Oak)పై కంగనా చేసిన ఫన్నీ కామెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అసలేం జరిగిందంటే.. గతేడాది గిరిజా ఓక్ పాల్గొన్న ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ క్లిప్‌లో బ్లూ కలర్ శారీలో గిరిజా కనిపించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దాంతో రాత్రికి రాత్రే ఆమెకు ఇంటర్నెట్ ప్రపంచం 'బ్లూ శారీ గర్ల్', ‘నేషనల్ క్రష్' (National Crush) అనే ట్యాగ్‌లను ఇచ్చేసింది. అయితే.. ప్రస్తుతం భారత్ భాగ్య విధాత సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హోస్ట్ గిరిజాను ఉద్దేశించి... "మీరు శారీ లుక్‌తో బాగా ఫేమస్ అయ్యారు కదా" అని ప్రశ్నించారు. దీనిపై గిరిజా స్పందిస్తూ.."ఒక పాడ్కాస్ట్ క్లిప్ అలా వైరల్ అయ్యింది. దానికి ఎలాంటి లాజిక్ లేదు. అంతా నా లుక్స్ గురించే కామెంట్ చేశారు. నిజం చెప్పాలంటే అందంగా ఉండటం నా గొప్పతనం కాదు. అది నా జీన్స్ (తల్లిదండ్రుల) వల్ల వచ్చింది. ఇందులో నేను సాధించిన విజయం ఏమీ లేదు" అంటూ చాలా సింపుల్‌గా సమాధానమిచ్చింది.
కంగనా రియాక్షన్..
గిరిజా మాటలు విన్న కంగనా రనౌత్ మధ్యలో కల్పించుకుని నవ్వుతూ.. "నువ్వు నా సినిమాలో నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి నీ ఆ 'అందాన్ని వాడుకుని మన సినిమాను కాస్త గట్టిగా ప్రమోట్ చెయ్" అంటూ హిందీలో సరదాగా కామెంట్ చేసింది. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. కాగా, మరాఠీ, హిందీ చిత్రాల్లో (తారే జమీన్ పర్, జవాన్) నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న గిరిజా ఓక్, రాబోయే భారత్ భాగ్య విధాత చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.






