- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంగన బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌పై అప్డేట్.. క్వీన్ తిరిగి వస్తోంది అంటూ పోస్ట్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చిత్రాల్లో ‘క్వీన్’ ఒకటి.

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చిత్రాల్లో ‘క్వీన్’ ఒకటి. వికాస్ బల్ దర్శకత్వంలో 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా.. ఈ చిత్రంతో కంగనాకు నేషనల్ అవార్డు వరించింది. ఒక సాధారణ అమ్మాయి తన పెళ్లి క్యాన్సిల్ అయ్యాక ఒంటరిగా హనీమూన్‌కు వెళ్లి, అక్కడ తనను తాను ఎలా ఆవిష్కరించుకుంది అనే స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ భారీ ప్రేక్షకాదారణ పొందింది. ఇప్పుడు ఇదే జోష్‌తో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న 'రాణి' తన అత్యంత అద్భుతమైన ప్రయాణంతో తిరిగి వస్తోంది.. కాశీ పవిత్ర ఘాట్ల నుండి కాశ్మీర్ అద్భుతమైన లోయల వరకు... క్వీన్ 2 భారతదేశపు సంస్కృతి, ఆధ్యాత్మికత, సౌందర్యం మరియు స్ఫూర్తిని మునుపెన్నడూ లేని రీతిలో ఆవిష్కరిస్తూ, దేశ హృదయాంతరాల్లో ఒక అద్భుతమైన యాత్రను చేపట్టబోతోంది. మన క్వీన్ కంగనా రనౌత్‌తో కలిసి ఒక మరపురాని సాహసయాత్రకు సిద్ధంగా ఉండండి.. త్వరలో క్వీన్-2 రాబోతోంది’ అంటూ కంగన సరికొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. అలాగే 2027లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.






