Kangana Ranaut: హాలీవుడ్ సినిమాలో క్రేజీ ఆఫర్ అందుకున్న కంగనా.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-09 12:15:15  IST  )

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రానౌత్(Kangana Ranaut) వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Kangana Ranaut: హాలీవుడ్ సినిమాలో క్రేజీ ఆఫర్ అందుకున్న కంగనా.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రానౌత్(Kangana Ranaut) వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ‘ఎమర్జేన్సీ’(Emergency) చిత్రంతో వచ్చిన ఈ భామకు నిరాశ ఎదురైంది. ఇందులో ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా కనిపించగా.. నటనకు బాగానే మార్కులు పడినప్పటికీ హిట్ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, కంగనా ఓ హాలీవుడ్ సినిమాలో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. హర్రర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీకి అనురాగ్ రుద్ర(Anurag Rudra) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని లయన్ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. టైల‌ర్ పోజీ, స్కార్లెట్ రోజ్ స్టాలోన్‌తో క‌లిసి కంగనా స్క్రీన్ ను షేర్ చేసుకోనుంది. ‘బ్లెస్డ్ బిది ఈవిల్’(Blessed be this evil) సినిమాకు సంబంధించిన షూటింగ్ సమ్మర్‌లో స్టార్ట్ కాబోతున్నట్లు టాక్. అయితే ఎక్కువ సీన్స్ మాత్రం యూఎస్‌లో చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హైప్ పెంచుతున్నాయి. అసలు ఆమె ఏ క్యారెక్టర్‌లో నటించనుందో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click For Tweet..

Next Story