- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన హీరోయిన్.. ఆ వెంటనే ట్వీట్ డిలీట్.. అసలేం జరిగిందంటే?
భారత్‌లో యాపిల్ కంపెనీ(Apple Company) విస్తరించవద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్యలపై బాలీవుడ్(Bollywood) నటి కంగనా రనౌత్(Kangana Ranaut) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో యాపిల్ కంపెనీ(Apple Company) విస్తరించవద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్యలపై బాలీవుడ్(Bollywood) నటి కంగనా రనౌత్(Kangana Ranaut) స్పందించారు. మోడీని ఫాదర్ ఆఫ్ ఆల్ ఆల్ఫా మేల్స్ అంటూ ట్వీట్ చేశారు. మోడీ(PM Modi), ట్రంప్‌ను పోల్చుతూ పోస్టు పెట్టారు. అయితే కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) సూచనతో ట్వీట్ తొలగించినట్లు సమాచారం. అయితే.. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన యాపిల్ కంపెనీని ట్రంప్ అడ్డుకున్నారు. స్వయంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడి, భారత్‌కు తయారీ ప్లాంట్లను తరలించవద్దని కోరారు. ఈ పరిణామం మేకిన్ ఇండియా ఇనిషియేటివ్‌కు భారీ ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది. ఖతార్‌లో జరిగిన ఓ సమావేశంలో టిమ్ కుక్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే వెల్లడించారు. తాజాగా దీనిపై కంగనా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఆ వెంటనే నడ్డా ఆదేశాలతో ట్వీట్ డిలీట్ చేశారు.






