Kangana Ranaut: అది కూడా ఆనందమే.. మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

by Chukka Sudharani |   (  Updated:2025-05-31 15:44:23  IST  )

బాలీవుడ్‌(Bollywood)లో ఫ్రైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్.. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతోంది.

Kangana Ranaut: అది కూడా ఆనందమే.. మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్‌(Bollywood)లో ఫ్రైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగనా రనౌత్.. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతోంది. అంతే కాకుండా.. సోషల్ మీడియా(Social media)లో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఎప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ(Bollywood industry)కి చురకలు అంటిస్తూ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది కంగనా. ‘ఏదైనా స్పోటివ్‌గా తీసుకునే నా మనసు వయసు(age) గురించి ఎప్పుడూ భయపడలేదు. కానీ.. నా సినీ ఇండస్ట్రీ(Film industry)కి చెందిన కొందరు ప్రముఖులు మాత్రం వైట్ హెయిర్ (White hair) రాగానే.. భయపడిపోతారు. కలర్ స్ప్రేలు (Color sprays) వాడతారు. అసలు వయసు పెరగడం కూడా ఓ ఆనందమే. ఇలా వయసు ప్రభావం లేని ప్రదేశంలో నేను ఉండటం చాలా సంతోషంగా ఉంది. నిజానికి చిత్ర పరిశ్రమలో కంటే రాజకీయాల్లో వృద్ధ మహిళ పట్ల దయతో ఉంటారు అని నేను అనుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story