‘కాంతార’ నుంచి కనకవతి పోస్టర్ రిలీజ్.. మహారాణి లుక్‌లో వావ్ అనిపిస్తున్న స్టార్ బ్యూటీ

by Gugulothu.Kavitha |

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘కాంతార: చాప్టర్ 1’(Kanthara: Chapter 1).

‘కాంతార’ నుంచి కనకవతి పోస్టర్ రిలీజ్.. మహారాణి లుక్‌లో వావ్ అనిపిస్తున్న స్టార్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘కాంతార: చాప్టర్ 1’(Kanthara: Chapter 1). కన్నడలో తెరకెక్కిన కాంతార మూవీకి ప్రీక్వెల్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్(Ajanesh Loknath)) సంగీతం అందిస్తుండగా.. హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ.. ‘కనకవతిని మీకు పరిచయం చేస్తున్నాం’ అని వెల్లడించారు. ఇక పోస్టర్‌లో రుక్మిణి వసంత్ ఒంటినిండా నగలతో మహారాణిని తలపిస్తున్నది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Next Story