Kamalini Mukherjee: ఆ పాత్రలో నటించి చాలా బాధ పడ్డా.. అందుకే తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చా.. కమలిని ముఖర్జీ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-08-28 14:12:31  IST  )

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేసి తప్పు చేశాను అంటుంది ఒకప్పటి బ్యూటీ కమలినీ ముఖర్జీ.

Kamalini Mukherjee: ఆ పాత్రలో నటించి చాలా బాధ పడ్డా.. అందుకే తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చా.. కమలిని ముఖర్జీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేసి తప్పు చేశాను అంటుంది ఒకప్పటి బ్యూటీ కమలినీ ముఖర్జీ. 2004లో ‘ఫిర్ మిలేంగే’ అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కమలినీ ముఖర్జీ. తర్వాత ‘ఆనంద్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి క్లాసికల్ హిట్ అందుకున్న ఈమె ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘గమ్యం’, ‘జల్సా’ వంటి మరెన్నో మూవీస్‌తో మంచి హిట్స్ అందుకున్న ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటించిన ఈ హీరోయిన్.. ఇప్పటి వరకు మరో చిత్రంలో కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాకు కూడా పూర్తిగా దూరంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘గోవిందుడు అందరివాడేలేలో నా పాత్ర నాకు అసలు నచ్చలేదు. కాబట్టి చివరి వరకు ఆ సినిమా నాకు అసమర్థంగా అనిపించింది. ఆ తర్వాత నాకు బాధగా అనిపించి కొంతకాలం తెలుగు సినిమాల నుండి తప్పుకున్నాను’ అని తెలిపింది. అలాగే కింగ్ నాగార్జున గురించి మాట్లాడుతూ.. ‘అక్కినేని నాగార్జున నిజంగా చాలా హాట్‌గా ఉంటారు. నేను ఆయన్ని ఎప్పుడు సూపర్ హాట్‌గా చూసేదాన్ని అని చెప్పడానికి చెప్పడానికి ఎలాంటి డౌట్ లేదు. అయితే.. మేము ఇద్దం కలిసి నటించిన చిత్రంలో ఆయన సాయి బాబా కాబట్టి.. అంతా హాట్‌గా చూడలేకపోయా.. కానీ షూటింగ్ మాత్రం ఎంజాయ్ చేశాము’ అని తెలిపింది. చివరిగా ‘మన్యం పులి’లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటుంది.

Next Story