‘సారీ చెప్పను.. కర్ణాటకలో సినిమా కూడా విడుదల చేయను’.. కమలహాసన్‌ మరో షాకింగ్ స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-03 10:04:03  IST  )

కన్నడ(Kannada) భాషపై తాను చేసిన వ్యాఖ్యలను నటుడు కమలహాసన్(Kamala Haasan) సమర్థించుకున్నారు.

‘సారీ చెప్పను.. కర్ణాటకలో సినిమా కూడా విడుదల చేయను’.. కమలహాసన్‌ మరో షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ(Kannada) భాషపై తాను చేసిన వ్యాఖ్యలను నటుడు కమలహాసన్(Kamala Haasan) సమర్థించుకున్నారు. మంగళవారం ఈ అంశంపై ఆయన మరోసారి స్పందించారు. తనకు కన్నడ భాష అంటే అమితమైన ప్రేమ ఉందని చెప్పారు. మనదంతా ఒకే భాషా అని చెప్పదలుచుకున్నానని అన్నారు. కన్నడను కించపరిచే ఉద్దేశం తనకు లేదు. రాదు కూడా అని వెల్లడించారు. తమిళం లాగే కన్నడకు కూడా సాంస్కృతిక నేపథ్యం ఉందని అన్నారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. అందరికీ అలాగే కన్వే చేస్తూ రెచ్చగొడుతున్నారని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు.. తప్పుడు వ్యాఖ్యలు చేసే వ్యక్తినీ నేను కాదు.. అందుకే క్షమాపణ చెప్పాలని అనుకోవడం లేదు.. చెప్పను కూడా అని కమలహాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదం నేపథ్యంలో కర్ణాటకలో థగ్‌లైఫ్ సినిమా(Thug Life Movie) విడుదల చేయడం లేదని సంచలన ప్రకటన చేశారు.

మరోవైపు.. కమల్ హాసన్ తాజాగా కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి కన్నడలో తన సినిమా విడుదల అయ్యేలా చూడాలని, అలాగే తనకు రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదులో ప్రతి వాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కన్నడ ఫిలిం ఛాంబర్ అలాగే ఇతర సంస్థలను కూడా చేర్చారు. అంతేకాకుండా తన సినిమా విడుదలయ్యే ముందు తగిన భద్రత కూడా కల్పించేలా సిటీ పోలీస్ కమిషనర్‌కు, డీజీపీకి కూడా సూచనలు జారీ చేయాలని కమల్ హాసన్ తన ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉంటే.. కన్నడలో థగ్ లైఫ్ సినిమాని విడుదల చేయకపోతే చిత్ర నిర్మాతలకు దాదాపు రూ.20 కోట్ల వరకూ నష్టం వస్తుంది అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మణిరత్నం(Maniratnam) దర్శకత్వం వహిస్తున్న ఈ ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శింబు(Simbu ), త్రిష (Trisha) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

హీరో కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం.. వారికి సంచలన లేఖ

Next Story