- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త మూవీ ప్రకటించిన కళ్యాణి ప్రియదర్శన్..
‘లోకా చాప్టర్ 1: చంద్ర’తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ పెంచేసుకున్న హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్..

దిశ, సినిమా: ‘లోకా చాప్టర్ 1: చంద్ర’తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ పెంచేసుకున్న హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.. ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. మాయ, మానగరం, మాన్స్టర్, తానక్కరన్, ఇరుగపాత్రు, బ్లాక్ వంటి వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాల తర్వాత పొటెన్షియల్ స్టూడియోస్ తమ ప్రొడక్షన్ నెంబర్ 7ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాన్ మహాన్ అల్లా ఫేమ్ దేవదర్శిని, వినోద్ కిషన్ కీలక పాత్రలు పోషించనున్నారు. నూతన దర్శకుడు ధీరవియం SN దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్‌పై SR ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు, పి. గోపీనాథ్, తంగప్రభహరన్ ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.






