- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడిన ఉత్కంఠ.. బిగ్‌బాస్ విజేత కల్యాణ్ పడాల
వీడిన ఉత్కంఠ.. బిగ్‌బాస్ విజేత కల్యాణ్ పడాల

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠకు తెర వీడింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్-9(Bigg Boss Season 9) విజేతగా కల్యాణ్ పడాల(Kalyan Padala) నిలిచారు. ఈ సీజన్‌లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కల్యాణ్ విజేతగా నిలిచినట్లు హోస్ట్ నాగార్జున (Nagarjuna) అధికారికంగా ప్రకటించారు. దీంతో కల్యాణ్‌కు రూ.35లక్షల ప్రైజ్ మనీతో పాటు, ట్రోఫీని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన కల్యాణ్ పడాల.. కష్టపడి ఇండియన్ ఆర్మీలో సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా చేరాడు. మూడేళ్లుగా సరిహద్దుల్లో దేశ సేవ చేస్తున్నాడు. కామనర్‌గా బిగ్ బాస్ లో అడుగు పెట్టి.. సెలబ్రిటీలకు సైతం గట్టి పోటీ ఇచ్చాడు. చివరకు బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో కూడా నెగ్గి.. ఫిజికల్ గేమ్స్‌తో పాటు మైండ్ గేమ్‌లోనూ సత్తా చాటాడు. తనదైన గేమ్‌తో, యాటీట్యూడ్‌తో ఆకట్టుకున్న కల్యాణ్.. అందరి దృష్టిని ఆకర్షించాడు. సామన్యుల కోటాలో బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్‌గా కప్పును సాధించాడు. దీంతో కల్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






