- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుమ్మడి నర్సయ్య సినిమా ప్రారంభోత్సవ ఈవెంట్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గుమ్మడి నర్సయ్య సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గుమ్మడి నర్సయ్య సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమాన్ని వదిలి ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు. అందరికీ ఆదర్శవంతం అయిన గుమ్మడి నర్సయ్య జీవితాన్ని సినిమాగా తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్ కామేశ్వర్ కామారెడ్డి బిడ్డ ఈ సినిమా తీస్తున్నాడని అన్నారు.
గుమ్మడి నర్సయ్య తెలంగాణ వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ సినిమాను సురేష్ రెడ్డి ఐదు భాషల్లో నిర్మించడం గొప్ప విషయం అన్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమా చేసేందుకు ముందుకు రావడంతో సినిమాకు ఎంతో పేరు వచ్చిందన్నారు. గుమ్మడి నర్సయ్య అంటే తమకు ఎంతో గౌరవం అని అలాంటి వ్యక్తి బయోపిక్ లో నటించడానికి శివరాజ్ కుమార్ ముందుకు రావడం పాత్రకు వన్నె తెచ్చిందన్నారు. ఈ సినిమా ద్వారా ఖమ్మం మరోసారి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి సినిమాలు వస్తే యువత క్లీన్ పాలిటిక్స్ వైపు అడుగువేసే అవకాశం ఉందన్నారు.






