- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కలియుగమ్-2064’ సినిమా సెన్సార్ పూర్తి.. క్యూరియాసిటీని పెంచుతున్న పోస్టర్
యంగ్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్(Shraddha Srinath) ‘జెర్సీ’ చిత్రంతో వచ్చి తన అందంతో అందరినీ కట్టిపడేసింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్(Shraddha Srinath) ‘జెర్సీ’ చిత్రంతో వచ్చి తన అందంతో అందరినీ కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడు వరుస అవకాశాలె అందుకుని పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది శ్రద్ధా ‘సైంధవ్’ సినిమాతో సూపర్ హిట్ సాధించింది. ఇటీవల ‘డాకు మహారాజ్’(Daaku Maharaj)మూవీతో వచ్చి ప్రేక్షకులను అలరించడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘కలియుగమ్-2064’ (Kaliyugam 2064) సినిమాలో నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఆర్‌కె ఇంటర్నేషనల్(RK International) బ్యానర్‌పై కెఎస్ రామకృష్ణ నిర్మిస్తున్నారు.
ఇక తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకురాబోతున్నారు. అయితే విభిన్న కథాంశంతో రాబోతున్న ‘కలియుగం-2064’లో కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఇంకా రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసుకోనప్పటికీ ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, ‘కలియుగం-2064’ సినిమా సెన్సార్ పూర్తి అయినట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. అయితే ఈ చిత్రం యూ/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక పోస్టర్ విషయానికొస్తే.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ గుర్తు పట్టలేనంతగా ఉంది. ముఖమంతా గాయాలతో బాధగా చూస్తూ కనిపించింది. ప్రస్తుతం శ్రద్దా పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
It's U/A from #Kaliyugam
— Vamsi Kaka (@vamsikaka) April 4, 2025
In theaters this summer @ShraddhaSrinath #Kishore pic.twitter.com/7X2nHM3cqS






