- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ramayana Glimpses: బాలీవుడ్ రామాయణంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇందులో భాగం అవ్వడం గౌరవంగా ఉందంటూ పోస్ట్
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టులలో ‘రామాయణం’ ఒకటి.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టులలో ‘రామాయణం’ ఒకటి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేసి.. మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ‘కాలం ఉనికిలో ఉన్నప్పటి నుండి.. త్రిమూర్తులు ముల్లోకాలను పరిపాలిస్తున్నారు. బ్రహ్మ: సృష్టించే దేవుడు, విష్ణువు: రక్షించే దేవుడు, శివుడు: అంతం చేయగలిగే వాడు.. కానీ వారి సృష్టి మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురుతిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది... ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ.. రాముడు VS రావణుడు.. రావణుడు: శక్తి & ప్రతీకారం, రాముడు: ధర్మం & త్యాగం’ అంటూ స్టార్ట్ అయినా ఈ గ్లింప్స్‌లో రణ్‌బీర్ కపూర్- రాముడు, యష్- రావణుడు, సాయి పల్లవి- సీత, రవి దుబే- లక్ష్మణుడు, సన్నీ డియోల్- హనుమంతుడు, సంగీతం- ఏఆర్ రెహ్మాన్, రచయితా- శ్రీధర్ రాఘవన్, డైరెక్టర్- నితేష్ తివారి, అంటూ ఇందులో క్యారెక్టర్స్‌ను రివీల్ చేశారు మేకర్స్.
అయితే.. ఈసినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ, తాజాగా వచ్చిన ‘రామాయణం’ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ తాను కూడా ఈ సినిమాలో భాగం అయినట్లు అధికారిక ప్రకటన ఇచ్చేసింది కాజల్. ఈ మేరకు ‘తరాలను తీర్చిదిద్దిన కథలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. రాముడు vs రావణుడి అమర కథ అయినా నమిత్ మల్హోత్రా రామాయణ ప్రపంచానికి స్వాగతం. ఈ మార్గంలో నడిచినందుకు.. దానిని మీ అందరితో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ క్షణాలను ఆస్వాదిద్దాం.. రామాయణం ప్రపంచంలోకి అడుగుపెడదాం.. మన నిజం.. మన చరిత్ర’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ప్రజెంట్ వైరల్ అవుతుండగా.. నువ్వు కూడా ఇందులో భాగం అయ్యావా.. నీ క్యారెక్టర్ ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.






