- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ రామాయణంలో టాలీవుడ్ చందమామా..
బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టులలో ‘రామాయణం’ (Ramayanam) ఒకటి.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టులలో ‘రామాయణం’ (Ramayanam) ఒకటి. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ (Director Nitish Tiwari)దర్శకత్వం వహిస్తుండగా.. నమిత్ మల్హోత్రాతో కలిసి అల్లు అరవింద్ (Allu Aravind) అత్యంత భారీ బడ్జె్ట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పార్ట్-1 2026 దీపావళి కానుకగా, పార్ట్-2 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన లుక్స్ కూడా నెట్టింట వైరల్ కాగా.. సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఇక రావణుడిగా స్టార్ హీరో యష్(Yash) నటిస్తుండటంతో ఈ సినిమాపై హైప్ మరింత క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో యష్ సరసన టాలీవుడ్ చందమామా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)మండోదరి పాత్రలో నటించనుందని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. పాత్ర యొక్క కీలకమైన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ పాత్రకు కాజల్ అగర్వాల్ సెట్ అవుతుందని చిత్రనిర్మాతలు బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి గట్టిగా వినిపిస్తుండటంతో కాజల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






