Kajal Aggarwal : వయస్సు 40.. కానీ యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని అందాల ఆరబోత

by Pulgam srinivas |   (  Updated:2026-02-24 07:59:37  IST  )

Kajal Aggarwal : 40 ఏళ్లలో కూడా ఏమాత్రం తగ్గని కాజల్ అందాలు.. ఒక్క కార్యక్రమంతో మళ్ళీ వార్తల్లో నిలిచింది.

Kajal Aggarwal : వయస్సు 40.. కానీ యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని అందాల ఆరబోత
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత చందమామ మూవీతో కమర్షియల్ విజయాన్ని అందుకుంది.

ఈ చిత్రం తర్వాత ఈమె నటించిన మగధీర టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడం, అందులో ఈమె తన అందంతో, నటనతో ప్రేక్షకులను అలరించడంతో ఒక్కసారిగా కాజల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరిపోయింది. దాంతో ఈమె చాలా సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేని స్థాయిలో కెరీర్ను సాగించింది.

కాజల్ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాషల సినిమాల్లో కూడా నటించింది. ముఖ్యంగా ఈమెకు తెలుగు తర్వాత తమిళ్, హిందీ ఇండస్ట్రీలు బాగా కలిసి వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితమే కాజల్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కాజల్ వయసు 40 సంవత్సరాలు. అయినా కూడా ఈమె తన తోటి హీరోయిన్లతో పోలిస్తే అదిరిపోయే రేంజ్లో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది.

కొన్ని సందర్భాలలో ఈ హీరోయిన్ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసి కుర్ర హీరోయిన్లకు నేనేమీ తక్కువ కాదు అని నిరూపించుకుంటుంది. ఈ నటి తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుకల్లో పాల్గొంది. ఈ కార్యక్రమానికి ఈమె అదిరిపోయే లుక్లో ఉన్న డ్రెస్ ధరించి వచ్చింది.

దానితో ఒక్కసారిగా చాలామంది కాజల్ అందం ఇంకా ఏమాత్రం తగ్గలేదు, ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే రేంజ్లో ఉంది. మళ్ళీ కాజల్ స్టార్ హీరోల పక్కన నటించి ఒకటి, రెండు కమర్షియల్ విజయాలను అందుకుంటే మళ్ళీ ఈ బ్యూటీని ఆపడం కష్టం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Next Story