- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Killer: కిల్లర్ గ్లింప్స్ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర బృందం.. ఫైరింగ్ మోడ్‌లో జ్యోతిరాయ్
‘గుప్పెడంత మనసు’ (Guppedanta Manasu) సీరియల్ జగతి మేడంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది జ్యోతి రాయ్

దిశ, సినిమా: ‘గుప్పెడంత మనసు’ (Guppedanta Manasu) సీరియల్ జగతి మేడంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది జ్యోతి రాయ్ (Jyoti Roy). సీరియల్స్‌లో 16 అణాల తెలుగింటి ఆడపడుచుల చీరలతో ఆకట్టుకున్న ఈమె.. సోషల్ మీడియా (Social media)లో మాత్రం తన గ్లామర్ షో(Glamor show)తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఇక జ్యోతి రాయ్ పూర్వాజ్ (Purvaj) అనే డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో జ్యోతిరాయ్ తన పేరును జ్యోతి పూర్వాజ్(Jyoti Purvaj)గా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ పూర్వాజ్. ఇప్పుడు ఈయన డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిల్లర్’ (Killer). ఈ చిత్రానికి పూర్వాజ్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్‌గా జ్యోతి పూర్వాజ్ అలరించనుంది.
సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ (Sci-fi action thriller) మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్, గౌతమ్ కూడా హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ, మెర్జ్‌ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుండగా.. తాజాగా మొదటి గ్లింప్స్ (Glimpses) అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మేరకు ‘విశ్వ పునరుత్థానం యొక్క మొదటి స్పర్శను వీక్షించండి. కిల్లర్ మేల్కొనబోతోంది.. ఏప్రిల్ 30న మధ్యాహ్నం 12-06 గంటలకు తెలుగు & కన్నడలో గ్లింప్స్ రాబోతుంది’ అంటూ జ్యోతి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో జ్యోతి స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూనే చేతిలో గన్ పట్టుకుని చూస్తుంది.






