- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'HHVM' నుంచి క్రిష్ తప్పుకోవడం పై బిగ్ ట్విస్ట్!
పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) తాజాగా నటించిన సినిమా హరిహర వీరమల్లు ( Hari hara veeramallu). డిప్యూటీ ముఖ్యమంత్రిగా

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) తాజాగా నటించిన సినిమా హరిహర వీరమల్లు ( Hari hara veeramallu). డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత... పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇక మొన్నటి వారం ఈ సినిమా రిలీజ్ అయి.... మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో... దర్శకుడు క్రిష్ మధ్యలోనే తప్పుకోవడం పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో... డైరెక్టర్ జ్యోతి కృష్ణ కీలక ప్రకటన చేశారు. హరిహర వీరమల్లు పార్ట్ 2 లో క్రిష్ రాసిన కథ కంటిన్యూ అవుతుందని.. వెల్లడించారు. కరోనా, లాక్ డౌన్, ఎన్నికలు ఇతర కారణాల వల్ల షూటింగుకు వరుసగా బ్రేకులు వచ్చాయని.. ఆయన స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే కమిట్మెంట్స్ వల్ల క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారని క్లారిటీ ఇచ్చారు జ్యోతి కృష్ణ.
ఆయన కోహినూర్ ప్రదానంశంగా మాయాబజార్ తరహాలో ఫన్ ఫిలిం తీయాలని అనుకున్నారని స్పష్టం చేశారు. ఆ తర్వాత తాను సనాతన ధర్మం అంశాన్ని జోడించి... రెండు పార్టులుగా సినిమా తీస్తానని హీరోకు వివరించినట్లు గుర్తు చేశారు. దానికి హీరో పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు జ్యోతి కృష్ణ. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.






