- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పిన NTR.. మ్యాడ్-2 సక్సెస్ మీట్‌లో ఇదే హైలైట్
రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో వచ్చిన మ్యాడ్ -2 చిత్రం(Mad-2 Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో వచ్చిన మ్యాడ్ -2 చిత్రం(Mad-2 Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన వారంలోనే దాదాపు రూ.80 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెట్ మీట్ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Junior NTR), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఒక్కో యాక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చివరలో ప్రొడ్యూసర్ కల్యాణ్ శంకర్ గురించి మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) డైలాగ్ చెప్పారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది చిత్రంలోని ‘మీ వెనుక ఏదో శక్తి ఉంది’ ఉంది అంటూ పోసాని చెప్పిన డైలాగ్‌ను ఎన్టీఆర్ మ్యాడ్-2 స్టేజీ మీద చెప్పారు. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి నటులతో పాటు నిర్మాత కూడా ఒక కారణం. ఈ చిత్రం వెనుక నాగవంశీ ఒక శక్తిలా ఉన్నాడు అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు హోరెత్తించారు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.






