- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ చేతిలోకి భారీ సినిమా.. ఇక ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే !
జూనియర్ ఎన్టీఆర్ ( NTR)... ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగుతోంది. అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ ( NTR)... ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగుతోంది. అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నారు. దాదాపు 15 సంవత్సరాలకు పైగా... ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన కెరీర్ లో.. యమదొంగ, స్టూడెంట్ నెంబర్ వన్,RRR లాంటి పెద్ద సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు.
ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయికి పెరిగింది. అయితే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఇటు తెలుగులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్.
అదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర 2 సినిమా కూడా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తయిన తర్వాత జైలర్ ఫేమ్ నెల్సన్ తో (Nelson Dilipkumar ) సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారట. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు. గతంలో బీస్ట్, జైలర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను నెల్సన్ తీసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా జైలర్ తరహాలోనే కొత్త కథను సిద్ధం చేస్తున్నారట నెల్సన్. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగాయని.. త్వరలో అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు.






