- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JR NTR : ఆ రెండు సినిమాలు వదిలేసి తప్పు చేశాను
JR NTR : నేను భద్ర, బొమ్మరిల్లు సినిమాలను రిజెక్ట్ చేశాను. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది అని తారక్ ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమాలో మరొకరు నటించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక హీరో దగ్గరికి ఓ స్టోరీ వచ్చిన సమయంలో దాన్ని అతను రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫెయిల్యూర్ అయితే ఆరోజు ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసి మంచి పని చేసాం అనుకోవడం, అదే సక్సెస్ అయితే ఆ సినిమా చేసి ఉండుంటే బాగుండేది అనుకోవడం కూడా జరుగుతుంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తన సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు.
అందులో కొన్ని మంచి విజయాలను అందుకున్నాయి. అలా తాను వదులుకున్న సినిమాల్లో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసినందుకు బాధపడుతున్నట్లు ఒకానొక సందర్భంలో ఆయన చెప్పుకొచ్చాడు. ఒక సందర్భంలో తారక్ మాట్లాడుతూ... నా దగ్గరకు కొన్ని సంవత్సరాల క్రితం బోయపాటి శ్రీను 'భద్ర' కథతో వచ్చాడు. ఎందుకో ఆ సమయంలో ఆ స్టోరీ నాకు నచ్చలేదు. దాంతో నేను ఈ సినిమా చేయలేను అని చెప్పాను. ఆ సినిమా విడుదల అయ్యి పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఆ సినిమాలో నేను నటించి ఉంటే బాగుండేది అని నాకు అనిపించినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.
అలాగే భాస్కర్ మొదట బొమ్మరిల్లు కథను నాకే వినిపించాడు. కథ అద్భుతంగా నచ్చింది. కానీ అందులో నా ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ ఏవీ లేవు, దానితో ఆ సినిమా మాస్ ఆడియన్స్ మరియు నా అభిమానులకు నచ్చదేమోననే ఉద్దేశంతో నేను దానిని రిజెక్ట్ చేశాను. ఆ సినిమాను కూడా నేను రిజెక్ట్ చేసి ఉండాల్సింది కాదు. ఇలా నేను వదిలేసుకున్న సినిమాలలో భద్ర, బొమ్మరిల్లు సినిమాలు చేసుంటే బాగుండేది అని ఆయన ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.






