మంచు లక్ష్మికి జర్నలిస్టు మూర్తి క్షమాపణ.. ఇంతటితో ఆపాలని విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Film Industry)లో మంచు లక్ష్మి, సీనియర్ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తి(Journalist VSN Murthy) మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

మంచు లక్ష్మికి జర్నలిస్టు మూర్తి క్షమాపణ.. ఇంతటితో ఆపాలని విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Film Industry)లో మంచు లక్ష్మి, సీనియర్ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తి(Journalist VSN Murthy) మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి స్వీయ నిర్మాణంలో తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నటించిన ‘దక్ష’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చోటు చేసుకున్న ఈ వివాదం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టు మూర్తి తనను బాడీ షేమింగ్ చేశారని.. మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేసింది. ఇంతటితో ఆగకుండా దీనిపై మహిళా కమిషన్‌లో కంప్లైంట్ చేస్తానని హెచ్చరించింది. దీంతో తాజాగా ఈ వివాదంపై జర్నలిస్టు మూర్తి స్పందించారు. ‘‘నటి మంచు లక్ష్మితో తాను చేసిన ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్న ఆమెకు మనస్తాపం కలిగించిందని తెలిసింది. ఈ విషయంలో ఎవరిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి బాధపడ్డారని తెలిసింది కాబట్టి, ఆమెకు నిస్సందేహంగా క్షమాపణ చెబుతున్నాను. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని ఆశిస్తున్నాను’ అని వీడియో ద్వారా మూర్తి వెల్లడించారు.

Next Story