ఆశా భోంస్లే మృతికి జాన్ సీనా నివాళి.. ఫిదా అవుతున్న నెటిజన్లు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-14 02:10:33  IST  )

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మరణం పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నివాళులర్పించారు.

ఆశా భోంస్లే మృతికి జాన్ సీనా నివాళి.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్, పద్మవిభూషణ్ గ్రహీత ఆశా భోంస్లే (Asha Bhosle) మరణం యావత్ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. కేవలం భారతీయులే కాకుండా విదేశీ ప్రముఖులు కూడా ఆమె మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) దిగ్గజం, హాలీవుడ్ నటుడు జాన్ సీనా (John Cena) ఆమెకు వినూత్నంగా నివాళి అర్పించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆశా భోంస్లే బ్లాక్ అండ్ వైట్ ఫోటోను జాన్ సీనా పోస్ట్ చేశారు. సాధారణంగా జాన్ సీనా తన పోస్టులకు ఎలాంటి వివరణ (Caption) ఇవ్వరు. ఈసారి కూడా అలాగే కేవలం ఫోటోను మాత్రమే షేర్ చేశారు. అయినప్పటికీ, భారతీయ సంగీతం పట్ల, ఆశా భోంస్లే పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘రియల్ లెజెండ్స్ గుర్తింపు ఇలాగే ఉంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఆశా భోంస్లే ఏప్రిల్ 12న వృద్ధాప్య సమస్యల కారణంగా కార్డియాక్ అరెస్ట్‌తో ముంబై (Mumbai)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆమె మరణం భారతీయ సినిమా రంగానికి తీరని లోటుగా మిగిలిపోయింది.

Next Story