- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి సినిమాలు చచ్చిన చేయను.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాపై నటుడు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం (John Abraham) లేటెస్ట్ సినిమా ‘టెహ్రాన్’.

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం (John Abraham) లేటెస్ట్ సినిమా ‘టెహ్రాన్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఆగస్టు 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్ అబ్రహం ‘ఛావా’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ప్రేక్షకులు మన నుంచి కొంచెం మంచిని, ఎంటర్‌టైన్మెంట్(Entertainment)ను ఆశిస్తారు. కాబట్టి అందుకు తగ్గ సినిమాలు తీయాల్సిన బాధ్యత ఫిల్మ్ మేకర్స్‌పై ఉంది. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అయితే రైట్ వింగ్‌కి చెందిన కొన్ని సినిమాలు.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం చూస్తుంటే ఆందోళనగా ఉంది. ప్రేక్షకులకు నచ్చాయని తెలుసు కానీ, నేను ఇప్పటివరకు ‘ఛావా’ (Chhaava), ‘కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir File) సినిమాలు నేను చూడలేదు. ఇలాంటి మూవీస్‌లో అవకాశం వచ్చిన ఎప్పటికీ చేయను. ఓ వర్గం ప్రజల్ని ఇవి ప్రభావితం చేయడం చూస్తుంటే నాకు భయమేస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.






