‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్‌.. జియో హాట్‌స్టార్‌ ఆసక్తికర పోస్టు

by Naga Rani Yarlagadda |

రామోజీ ఫిలిం సిటీలో మరికొద్దిసేపటిలో గ్లోబ్ ట్రాటర్ ఫస్ట్ ఈవెంట్ మొదలు కానుంది.

‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్‌.. జియో హాట్‌స్టార్‌ ఆసక్తికర పోస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: రామోజీ ఫిలిం సిటీలో మరికొద్దిసేపటిలో గ్లోబ్ ట్రాటర్ ఫస్ట్ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే మహేష్, రాజమౌళి అభిమానులు పాసులు పట్టుకుని ఈవెంట్ కు చేరుకున్నారు. ఈ ఈవెంట్లో #SSMB29 సినిమా టైటిల్ తో పాటు.. స్పెషల్ వీడియోను కూడా విడుదల చేయనున్నట్లు జక్కన్న ప్రకటించారు. మరోవైపు సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో.. టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాపై జియా హాట్ స్టార్ ఓటీటీ సంస్థ ఆసక్తికర పోస్ట్ చేసింది. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచేలా మహేశ్ ఫొటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. ఈ లుక్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలోదేనా? అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story