నటుడి దారుణ హత్య.. ఒంటిపై బట్టలు లేని స్థితిలో.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్

by Sujitha Rachapalli |

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ‘ఝుండ్’ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన యువ నటుడు ప్రియాన్ష్‌ను తన బెస్ట్ ఫ్రెండ్ ధ్రువ్ లాల్ బహదూర్ సాహు హత్య చేశాడు. తరుచుగా కలిసి తాగే వీరిద్దరి మధ్య ఓ

నటుడి దారుణ హత్య.. ఒంటిపై బట్టలు లేని స్థితిలో..  ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ‘ఝుండ్’ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన యువ నటుడు ప్రియాన్ష్‌ను తన బెస్ట్ ఫ్రెండ్ ధ్రువ్ లాల్ బహదూర్ సాహు హత్య చేశాడు. తరుచుగా కలిసి తాగే వీరిద్దరి మధ్య ఓ విషయంలో గొడవ జరగ్గా.. ప్రియాన్ష్ ధ్రువ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ప్రతీకారంగా పడుకుని ఉన్న ప్రియాన్ష్‌పై రాత్రి దాడి చేశాడు. మెడను వైర్‌తో గట్టిగా బిగించి.. కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడి.. బట్టలు లేకుండా.. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న అతన్ని.. హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించారు వైద్యులు. ఇక ఈ విషయం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. యువ నటుడిని కోల్పోవడంపై విషాదం వ్యక్తం చేస్తున్నారు. నాగ్‌పూర్‌ జారిపట్కా ప్రాంతంలో ఈ నెల 8న రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Next Story