Jhanvi Kapoor: గంటల తరబడి బరువులు ఎత్తను.. నా ఫిట్‌నెస్ సీక్రెట్ అదే

by Pulgam srinivas |

పైలేట్స్ పద్ధతిని ఫాలో కావడం వల్లే తాను నాజుగ్గా, ఫిట్‌గా ఉన్నట్లు జాన్వి కపూర్ తెలియజేసింది. ఈ పద్ధతిలో శరీరాన్ని విల్లులా వంచి మనస్సును ఏకాగ్రతగా ఉంచుకోవాలి అని ఈమె చెప్పుకొచ్చింది.

Jhanvi Kapoor: గంటల తరబడి బరువులు ఎత్తను.. నా ఫిట్‌నెస్ సీక్రెట్ అదే
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల ముద్దుల కూతురు అయిన ఈ బ్యూటీ చాలా కాలం క్రితమే హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు చాలా హిందీ చిత్రాల్లో నటించినా ఈమెకు అక్కడ మంచి విజయాలు దక్కలేదు. అలాంటి సమయంలోనే ఈ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇప్పటికే ఈ నటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే తెలుగు చిత్రంలో నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోయే దేవర పార్ట్ 2 లో కూడా ఈమె భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ నటి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. జాన్వి కపూర్ అద్భుతమైన రీతిలో అందాలను మెయింటైన్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా వరుస పెట్టి సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావాలంటే అందం ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తుంది.

దానితో హీరోయిన్లు గంటల తరబడి జిమ్లో కష్టపడి, పెద్ద పెద్ద బరువులను లేపుతూ ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ జాన్వి కపూర్ మాత్రం అలా పెద్ద పెద్ద బరువులు లిఫ్ట్ చేయకుండా, గంటల తరబడి జిమ్ లో కష్టపడకుండా అద్భుతమైన బాడీ షేప్ ను మెయింటెన్ చేస్తుంది. అది ఎలానో తెలుసా? పైలేట్స్ పద్ధతి ద్వారా. పైలెట్స్ పద్ధతి అంటే ఏమిటి అనుకుంటున్నారా? ఇందులో శరీరాన్ని విల్లులా వంచవలసి ఉంటుంది, అలాగే మనసును ఏకాగ్రతగా ఉంచుకోవాలి. ఈ రెండు పనులను సక్రమంగా చేసినట్లయితే గంటల తరబడి జిమ్ లో పెద్ద పెద్ద బరువులు లిఫ్ట్ చేసిన దానికంటే కూడా ఎంతో ఉపయోగం అని, చాలా ఫిట్నెస్ గా సన్నగా ఉండవచ్చు అని ఈ బ్యూటీ తన ఫిట్నెస్ సీక్రెట్ చెబుతోంది.

Next Story