- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జెట్లీ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు
‘జెట్లీ’ చిత్రాన్ని మే 25 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు సంబంధిత సంస్థ అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జెట్లీ’. ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పర్వాలేదనే టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా మే 25 నుంచి ఈ సినిమాను తమ వేదికలో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం పొందనున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో రియా సింఘా హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించాడు. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించింది.






