- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమాండింగ్ యాక్షన్ హీరోయిన్
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. మేకర్స్ ముందుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సత్య ఒక విమానం పైన కూర్చుని "I am done with comedy"

దిశ, సినిమా : టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. మేకర్స్ ముందుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సత్య ఒక విమానం పైన కూర్చుని "I am done with comedy"అని ప్రజెంట్ చేయడం హిలేరియస్ అనిపించింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ) , హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్న జెట్లీని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా ‘జెట్లీ’తో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విమానం లోపల మండుతున్న పేలుడు మధ్య, చేతిలో తుపాకీ పట్టుకొని కనిపించడం ఆకట్టుకుంది. ఎగిరే శిథిలాలు, పగిలిపోయిన వస్తువులు, డ్రమాటిక్ లైటింగ్ ఆమె చుట్టూ ఉన్న ఇంటెన్స్ బ్యాక్ డ్రాప్ చూపిస్తోంది. మొత్తం లుక్ బోల్డ్, పవర్‌ఫుల్‌గా ఉండగా.. కమాండింగ్ యాక్షన్ హీరోయిన్‌గా కనిపించబోతోంది.






