- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karthi: కార్తీ మార్షల్‌లో విలన్‌గా ఆ స్టార్ నటుడు.. హైప్ పెంచేస్తున్న న్యూస్!
హీరో కార్తీ (Karthi) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు.

దిశ, సినిమా: హీరో కార్తీ (Karthi) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘మార్షల్’ (Marshal) ఒకటి. ఈ సినిమాకు ‘తానాక్కారన్’ ఫేమ్ డైరెక్టర్ తమిళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరీ రావు, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో విలన్ క్యారెక్టర్ కోసం స్టార్ నటుడు నివిన్ పౌలీని సంప్రదించగా.. ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం తమిళ స్టార్ నటుడు జీవాను ఎంపిక చేశారట మేకర్స్. ఇప్పటికే చర్చలు జరపగా.. జీవి నెగిటివ్ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం. కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తికాగా.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. లింక్






