ఆ మ్యాజిక్ అంతా రచనలోనే ఉంది.. జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

by Chukka Sudharani |

తరుణ్ భాస్కర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గాయపడ్డ సింహం’ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ కాగా.. ఈ సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ఆ మ్యాజిక్ అంతా రచనలోనే ఉంది.. జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: తరుణ్ భాస్కర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ కాగా.. ఈ సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. మే 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలకు సిద్ధం అవుతుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి తన పాత్రపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చాలెంజెస్‌తో కూడిన పాత్ర ప్రయాణం ఏ నటుడికైనా ఎప్పుడూ ఎగ్జైటింగానే ఉంటుంది. సాధారణంగా పాత్రలకు మొదటి, రెండవ భాగాలలో వేర్వేరు కోణాలు ఉంటాయి.. కానీ ఇది మాత్రం ఒకేలా ఉంటూనే రెండు కోణాలను చూపిస్తుంది. అదే నన్ను బాగా ఎగ్జైట్ అయ్యేలా చేసింది. ఈ పాత్ర గురించి నేను ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మీరు సినిమా చూసినప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఆ మ్యాజిక్ అంతా రచనలోనే ఉంది’ అంటూ తన పాత్ర గురించి జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.

Next Story