వాళ్లకు లేని నొప్పి మనకెందుకు.. హీరోల డూప్‌లపై జేడీ చక్రవర్తి హాట్ కామెంట్

by Chukka Sudharani |

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి త్వరలో ‘గాయపడ్డ సింహం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వాళ్లకు లేని నొప్పి మనకెందుకు.. హీరోల డూప్‌లపై జేడీ చక్రవర్తి హాట్ కామెంట్
X

దిశ, సినిమా: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి త్వరలో ‘గాయపడ్డ సింహం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈయన హీరోల డూప్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఇప్పుడు ఫలానా హీరో సెట్‌కి రాట్లేదు.. క్లోజప్స్ ఇచ్చి ఫేస్ స్వాప్స్, డూప్స్‌తోమేనేజ్ చేస్తున్నాడు.. ఆ విషయం అతనితో పని చేసే డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి, ఇండస్ట్రీకి తెలియదు అనుకుంటున్నారా?... స్టిల్ అతనితో ఎందుకు వర్క్ చేస్తున్నారు. మార్కెట్ ఉంది గనుక. మరి డబ్బులు పెట్టే వాళ్ళకి లేని నొప్పి మనకెందుకు... ఆడియన్స్ చేసేది ఏంటి సింపిల్ కంటెంట్ నచ్చితే చూస్తారు లేదంటే చూడరు. అంతే కానీ ఈ డూపులు ఇవన్నీ పట్టించుకోరు... మరి కొంతమంది ఎందుకు గెడ్డం దగ్గర VFX, హెడ్ స్వాప్ చేశారు అని బుర్రలు బాదుకుంటున్నారు.. అయినా వాళ్ళే చెప్తున్నారుగా మాకు ఆరు నెలలు VFX వర్క్ జరిగింది ఇంత ఖర్చు అయింది అని.. వాళ్లే ఒప్పుకున్నాక ఇది డూప్, అది VFX అంటూ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు

Next Story