పెళ్లి కాకపోయినా తల్లి కావొచ్చు.. మనవరాలికి కూడా ఇదే చెప్పిన.. సీనియర్ హీరోయిన్

by Sujitha Rachapalli |

సీనియర్ నటి జయా బచ్చన్ ఒక ఫైర్ బ్రాండ్. ఏదీ ఒక పట్టాన నచ్చదు. పాపరాజీలు కనిపిస్తే చాలు క్లాస్ పీకుతుంది. వాళ్లను మాత్రమే కాదు భర్త అమితాబ్ బచ్చన్, సొంత బిడ్డ, కొడుకు, మనవరాళ్లను కూడా లెక్క చేయదు. తనకు నచ్చలేదంటే మొహం మీదనే చెప్పేస్తుంది.

పెళ్లి కాకపోయినా తల్లి కావొచ్చు.. మనవరాలికి కూడా ఇదే చెప్పిన.. సీనియర్ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటి జయా బచ్చన్ ఒక ఫైర్ బ్రాండ్. ఏదీ ఒక పట్టాన నచ్చదు. పాపరాజీలు కనిపిస్తే చాలు క్లాస్ పీకుతుంది. వాళ్లను మాత్రమే కాదు భర్త అమితాబ్ బచ్చన్, సొంత బిడ్డ, కొడుకు, మనవరాళ్లను కూడా లెక్క చేయదు. తనకు నచ్చలేదంటే మొహం మీదనే చెప్పేస్తుంది. చిరాగ్గా మాట్లాడుతుంది. తన మనవరాలు నవ్యా నందన్ ఓ పాడ్ కాస్ట్‌ హోస్ట్ చేయగా.. ఇందులో పాల్గొన్న ఆమె.. ఇలాగే మొహమాటం అనేదే లేకుండా తన అభిప్రాయాలను చెప్పేసింది. ఈ క్రమంలోనే నవ్యకు పెళ్లి కాకపోయినా పిల్లలను కనొచ్చని.. ఇందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని.. అసలు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. డబ్బున్నోళ్ల ఆలోచనా విధానమే వేరు అంటున్నారు నెటిజన్లు. తమకు కూడా ఇలాంటి గ్రాండ్ మదర్‌ను ఇస్తే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story