'రామాయణ'కి జపాన్ ముప్పు?

by Pulgam srinivas |

గాడ్జిల్లా మైనస్ జీరో అనే జపాన్ చిత్రాన్ని నవంబర్ 6న ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నారు. ఆ సినిమా విడుదల కారణంగా రామాయణ మూవీకి ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రామాయణకి జపాన్ ముప్పు?
X

దిశ, వెబ్ డెస్క్: రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో రూపొందుతున్న చిత్రం రామాయణ. కన్నడ స్టార్ నటుడు యాష్ ఇందులో రావణుడిగా కనిపించబోతున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు.

దాంతో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ అందుకు సంబంధించిన పనులను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఈ మూవీకి ఓ జపాన్ చిత్రం నుండి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2023లో విడుదలైన గాడ్జిల్లా మైనస్ వన్ ఏ స్థాయి ఇంపాక్ట్‌ను బాక్సాఫీస్ వద్ద చూపించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా గాడ్జిల్లా మైనస్ జీరో అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సినిమాను నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని కూడా ఐమాక్స్ ఫార్మాట్‌లోనే రూపొందించారు. ఈ మూవీని కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే గానీ జరిగితే, ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు దగ్గరగా ఉండడం వల్ల రామాయణ చిత్రానికి ఐమాక్స్ థియేటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, అలా జరిగితే అది ఈ చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story