- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెమెరా ముందు.. సెట్‌లో అందరు చూస్తుండగానే.. హీరోయిన్‌ను యూరిన్ చేయమన్న డైరెక్టర్.. కట్ చేస్తే ఆమె చేసిన పనికి అందరూ షాక్.. (ఫుల్ డిటెయిల్స్)
సినిమాలో సీన్ రియలిస్టిక్‌గా అనిపించేందుకు డైరెక్టర్స్, యాక్టర్స్ కొన్ని ప్రయోగాలు చేయడం కామన్. పైగా ఇంతకు ముందు ఇండస్ట్రీలో చేయని ఎక్స్‌పరిమెంట్స్ చేస్తే బాగుంటుందని కొందరు ట్రై చేస్తారు కూడా. ఈ క్రమంలో ఓ కుర్ర హీరోయిన్ కెమెరా ముందు

దిశ, ఫీచర్స్ : సినిమాలో సీన్ రియలిస్టిక్‌గా అనిపించేందుకు డైరెక్టర్స్, యాక్టర్స్ కొన్ని ప్రయోగాలు చేయడం కామన్. పైగా ఇంతకు ముందు ఇండస్ట్రీలో చేయని ఎక్స్‌పరిమెంట్స్ చేస్తే బాగుంటుందని కొందరు ట్రై చేస్తారు కూడా. ఈ క్రమంలో ఓ కుర్ర హీరోయిన్ కెమెరా ముందు.. సెట్‌లో అందరు చూస్తుండగానే.. యూరిన్ చేసేందుకు ఒప్పుకుంది. సినిమా చరిత్రలో మిగిలిపోతానని కమిట్ అయింది. కానీ ఈ ప్రయోగం కాస్త చివరలో ఆగిపోయింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు? ఆమెకు చెప్పిన డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా ఏంటి? ఏం కథ? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హిందీ యాక్టర్ జాన్కీ బోడివాలా స్వయంగా తన ఎక్స్‌పీరియన్స్‌ను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. గుజరాతి హారర్ ఫిల్మ్ వశ్‌ను హిందీలో రీమేక్ చేద్దామనుకున్నారు డైరెక్టర్ కృష్ణదేవ్ యాజ్ఞిక్. షైతాన్ పేరుతో సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో జాన్కీని కలిసి ఈ విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆయన.. యూరిన్ చేసే సీన్ నిజంగా చేస్తే బాగుంటుందని, ఇలాంటి సినిమా చరిత్రలో జరగలేదని చెప్పాడు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఆమె ప్రయోగాలు చేస్తే బాగుంటుందని అనుకుని ఇందుకు కమిట్ అయిందట. కానీ ఈ మూవీ మధ్యలోనే ఆగిపోవడంతో ఆ సీన్ చేయలేకపోయామని తెలిపింది.






