- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ ఇండస్ట్రీపై జాన్వీ ప్రశంసలు.. బాలీవుడ్‌లో రాజీపడాల్సి వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్
సినిమాలోని ప్రతీ సీన్ అద్భుతంగా రావాలనే ప్రయత్నిస్తారని.. దానికోసం ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారని ప్రశంసించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న (జూన్4) ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ టాలీవుడ్, బాలీవుడ్‌ల మధ్య ఉన్న తేడా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో పని గంటలకు ఎక్కువ ప్రాధాన్య ఉంటుందని అది తనకు చాలా నచ్చినట్లు తెలిపింది. సౌత్ సినిమా షూటింగ్‌లో అందరిలో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. అక్కడ కేవలం ఓ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనో డెడ్‌లైన్లలో అందుకోవాలనో మాత్రమే పనిచేయరని అన్నారు. సినిమాలోని ప్రతీ సీన్ అద్భుతంగా రావాలనే ప్రయత్నిస్తారని.. దానికోసం ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారని ప్రశంసించారు. హిందీ సినిమా విషయానికొస్తే.. అక్కడ బడ్జెట్, టైమ్‌లైన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని.. అంతా రూల్ ప్రకారం జరుగుతుందని తెలిపింది.
కొన్నిసార్లు అతిజాగ్రత్తల వల్ల క్రియేటివిటీ విషయంలో రాజీపడాల్సి వస్తుందని.. అలాగే పక్కా ప్రణాళికల వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇక తెలుగులో సినిమా సెట్స్‌లో బ్రేక్ టైమింగ్స్ కూడా చాలా ఖచ్చితంగా పాటిస్తారని జాన్వీ పేర్కొన్నారు. అక్కడ లంచ్ బ్రేక్ ఇస్తే, ప్రతి ఒక్కరూ కంగారు పడకుండా సుమారు 40 నిమిషాల పాటు ప్రశాంతంగా భోజనం చేయడానికి సమయం దొరుకుతుందని.. ఆ తర్వాత పని ప్రారంభించే ముందు కనీసం ఒక 20 నిమిషాల పాటు చిన్నపాటి నిద్ర తీసేందుకు కూడా వీలుంటుందని చెప్పారు. అయితే, ఇలాంటి సౌకర్యాలు కొన్నిసార్లు తమ బాలీవుడ్ ఇండస్ట్రీలో లోపిస్తాయని, అక్కడ ఈ విషయాల్లో కాస్త రాజీ పడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తాను తెలుగులో చేసిన ప్రాజెక్ట్‌ల సమయంలో ఎప్పుడూ లాంగ్ షిఫ్ట్‌లు చేయాల్సిన అవసరం రాలేదని జాన్వీ గుర్తుచేసుకున్నారు. కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 12 గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నానని.. మిగతా అన్ని రోజుల్లో కేవలం 9 నుండి 10 గంటల లోపే తన పని ముగించుకుని ప్యాకప్ చెప్పేవాళ్లని తెలిపారు.






