- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janhvi Kapoor: ‘పరం సుందరి’లో జాన్వీ కపూర్ పాత్రపై ట్రోల్స్.. స్పందించిన హీరోయిన్
జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరం సుందరి’

దిశ, సినిమా: జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరం సుందరి’ (Param Sundari). తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే.. ఈ ట్రైలర్‌పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కేరళ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీలో.. మాలయాళ హీరోయిన్స్‌ను తీసుకోవచ్చు కదా.. హిందీ అమ్మాయికి కష్టంగా మలయాళ నేర్పించడం ఎందుకు అంటూ నటి పవిత్ర మీనన్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టా ద్వారా ప్రశ్నిస్తూ ఓ వీడియో షేర్ చేసింది.
ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటున్న జాన్వీ కపూర్ రీసెంట్‌గా దీనిపై స్పందిస్తూ.. మలయాళ సినిమా పట్ట తనుకున్న అభిమానాన్ని వ్యక్తం చేసింది. ‘మలయాళీ మూలాలు కలిగిన పాత్రను నేను పోషించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పాత్ర తిమళ, మలయాళీ వారసత్వాన్ని కలగలిపింది’ అంటూ తెలిపింది. కాగా.. సిద్ధార్థ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్నా్న్ని మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.






