- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో నాని సినిమాలో బంపర్ ఆఫర్..రిజెక్ట్ చేసిన జాన్వీ ?
కాయదు లోహర్ ( Kayadu Lohar) హీరోయిన్ గా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఈమె కంటే ముందుగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నాని ( Nani) ప్రస్తుతం చేస్తున్న పెద్ద ప్రాజెక్టు ది పారడైజ్( The Paradise). భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే నాని, శ్రీకాంత్ కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చి సక్సెస్ అందుకుంది. అదే ఊపుతో ఇప్పుడు ఈ మూవీని చేస్తున్నారు. మార్చి 26వ తేదీ 2026 లో దాదాపు 8 భాషల్లో పానీ ఇండియా రేంజ్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. 1980 దశకంలో సికింద్రాబాద్ లోని మురికి వాడల నేపథ్యంలో ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుందట.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అంచనాలను భారీగా పెంచాయి. ఈ మూవీలో నాని రెండు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ది ప్యారడైజ్ సినిమాలో చివరి క్షణంలో కాయదు లోహర్ ( Kayadu Lohar) హీరోయిన్ గా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఈమె కంటే ముందుగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. కానీ పెద్ది సినిమా షూటింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను సింపుల్ గా రిజెక్ట్ చేశారట జాన్వీ కపూర్. దీంతో లైట్ తీసుకున్న చిత్ర బృందం వెంటనే కాయదు లోహర్ ను ఫైనల్ చేసిందని అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.






