- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janhvi Kapoor: టైగర్ ష్రాఫ్‌తో రొమాన్స్ చేయనున్న జాన్వీ.. ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్న మూవీ.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి వచ్చి విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగు మొట్టమొదటి సినిమానే యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సరసన ‘దేవర’లో నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘పెద్ది’(peddi)లో నటిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దివ్యేందు శర్మ(Divyendu Sharma), శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్ ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన రొమాన్స్ చేయనుంది. రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
అయితే యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ‘లగ్జాగేల్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మొట్టమొదటిసారి జాన్వీ కపూర్-టైగర్ ష్రాఫ్ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంటెన్స్ యాక్షన్ అండ్ పవర్‌ఫుల్ రొమాన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల్లో క్యూరియాసిటీ పెరిగింది.






