‘అందుకు సిద్ధంగా ఉన్నాను.. క్యాప్షన్ కోసం నన్ను చంపకండి’ అంటూ బాలీవుడ్ బ్యూటీ పోస్ట్

by Kodari Anjali |

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘అందుకు సిద్ధంగా ఉన్నాను.. క్యాప్షన్ కోసం నన్ను చంపకండి’ అంటూ బాలీవుడ్ బ్యూటీ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ధడక్ అనే హిందీ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి పేరు సంపాదించుకుంది. ఈమె దివంగత స్టార్ సీనియర్ నటి శ్రీదేవి కుమార్తె అన్న విషయం తెలిసిందే. తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్లిక్ గర్ల్, అంగ్రేజీ మీడియం, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఘా జియా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలాజ్ వంటి సినిమాల్లో నటించి ఈ హీరోయిన్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. పింక్ విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డులు, జీ సినీ అవార్డులు, లోక్‌మత్ స్టైలిష్ అవార్డులు, బాలీవుడ్ హంగామా స్టైల్ చిహ్నాలు, పింక్‌విల్లా స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్స్ అవార్డులు వంటివి సొంతం చేసుకుంది.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో విమర్శలు ఎదుర్కోన్న తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది. చుట్టమల్లె చుట్టేశావే సాంగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ముంబయి వర్షాలకు సిద్ధంగా ఉన్నాను.@rheakapoor క్యాప్షన్ కోసం నన్ను చంపకండి’ అంటూ ఓ క్యాప్షన్ రాసి బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే ఫొటోలు పంచుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story