- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిన్స్ బౌలింగ్.. జాన్వీ కపూర్ బ్యాటింగ్, క్యూట్ వీడియో వైరల్
ప్యాట్ కమిన్స్, పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ హాజరై, సరదాగా క్రికెట్ ఆడారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బ్యాటింగ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. గల్లీ క్రికెట్ తరహాలో ఈ ఇద్దరు స్టార్లు ఆడారు. నోయిడాలోని DLF మాల్ ఆఫ్ ఇండియాలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కు ప్యాట్ కమిన్స్, పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ హాజరై, సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేయగా... టీ షర్టు ధరించి జాన్వీ కపూర్ బ్యాటింగ్ చేశారు. మొదటి మూడు బంతులు సరిగ్గా ఆడిన జాన్వీ... ఆ తర్వాత కొంప ముంచింది.
వీడియో తీస్తున్న ఓ వ్యక్తి మొబైల్ కు గట్టిగా కొట్టేసింది. దీంతో అతని ఫోన్ కింద పడిపోయింది. ఈ సంఘటన నేపథ్యంలో జాన్వీ కపూర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయ్యో పాపం అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్లతో కూడా పెద్ది సినిమా ప్రమోషన్ చేస్తోందని జాన్వీ కపూర్ ను మరి కొంతమంది మెచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మధ్యలోనే వచ్చిన కమిన్స్... హైదరాబాద్ జట్టును ప్లే ఆఫ్ కు చేర్చాడు. ఇక ఎల్లుండి లీగ్ దశలో బెంగుళూరుతో మరో మ్యాచ్ కు సిద్ధమయ్యాడు.






