Janhvi Kapoor: పెద్ది సెట్స్‌లో జాన్వీ కపూర్.. రొమాంటిక్ సీన్స్‌తో పాటు రెండు పాటలు కూడా

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’.

Janhvi Kapoor: పెద్ది సెట్స్‌లో జాన్వీ కపూర్.. రొమాంటిక్ సీన్స్‌తో పాటు రెండు పాటలు కూడా
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత భారీగా పెరిగాయి.

అంతే కాకుండా.. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ కాగా.. తాజాగా నెక్ట్స్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ కపూర్ జాయిన్ కాబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు వైరల్ అవుతోన్ పోస్ట్ ప్రకారం.. జాన్వీ జూలై 12 నుంచి ‘పెద్ది’ తిరిగి జాయిన్ కానుందని.. దాదాపు ఈ సినిమాకు సంబంధించి 40 రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగా.. ఆ సమయంలో జాన్వీపై కీలకమైన సన్నివేశాలతో పాటు రొమాంటిక్ సీన్స్‌తో పాటు రెండు పాటలను చిత్రీకరించనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారింది. కాగా.. ఈ మూవీ మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల కానుంది. Link

Next Story