అభిమానిని ఎత్తిప‌డేసిన‌ రామ్ చరణ్ బాడీగార్డ్..వీడియో వైరల్

by velandi.Saikiran |   (  Updated:2026-06-02 12:42:53  IST  )

రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్... ఓ మెగా అభిమానిని అవలీలగా పక్కకు ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అభిమానిని ఎత్తిప‌డేసిన‌ రామ్ చరణ్ బాడీగార్డ్..వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, జూన్ 4వ తేదీన అంటే ఎల్లుండి రిలీజ్ కానుంది. రేపు రాత్రి ప్రీమియర్లు పడనున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రమోషన్స్ వేగం పెట్టింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా రామ్ చరణ్ తిరుగుతున్నారు. నిన్న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన వైరల్ గా మారింది.

రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్... ఓ మెగా అభిమానిని అవలీలగా పక్కకు ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ పక్కనే రామ్ చరణ్ కూర్చోగా... ఆ సమయంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. ఈ మేరకు రామ్ చరణ్ పైకి దూసుకు వచ్చాడు. ఈ క్రమంలో అలర్ట్ అయిన బాడీగార్డ్ కెవిన్, వెంటనే సదరు అభిమానిని ఎత్తుకొని దూరంగా వదిలిపెట్టాడు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అదే అభిమానిని పిలిపించి సెల్ఫీ ఇచ్చి పంపించాడు రామ్ చరణ్. ఇది ఇలా ఉండ‌గా, బాడీగార్డ్ కెవిన్ జీతం రోజుకు రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌.

Next Story