ఆ హీరో నైట్ పార్టీ.. అడ్డంగా దొరికిపోయిన జాన్వీ !

by velandi.Saikiran |   (  Updated:2025-08-16 02:55:38  IST  )

నైట్ పార్టీకి వెళ్లారు హీరో జాన్వీ అలాగే సిద్ధార్థ్. ఈ సందర్భంగా ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా కనిపించారు

ఆ హీరో నైట్ పార్టీ.. అడ్డంగా దొరికిపోయిన జాన్వీ !
X

దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కు ( Janhvi Kapoor) ఉన్న ఫాలోయింగ్ ఎంత కాదు. అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురుగా... ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్... ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అటు తెలుగులో కూడా... మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది ఈ అందాల తార.

జూనియర్ ఎన్టీఆర్ ( NTR) నటించిన దేవర సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్.. అందాలు ఆరబోసి తెలుగు ప్రేక్షకులను మైమరపించింది. ఇక అటు రామ్ చరణ్ తో ( Ram Charan) కూడా సినిమా చేస్తోంది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో ఓ బాలీవుడ్ హీరోతో... కాస్త చనువుగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది హీరోయిన్ జాన్వీ కపూర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పరం సుందరి ( Param Sundari ) సినిమాలో ప్రస్తుతం జాన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధార్థ మల్హోత్రా ( Sidharth Malhotra ) కథానాయకుడిగా కనిపించనున్నారు. ఆగస్టు 29వ తేదీన రిలీజ్ కానున్న తరుణంలో సినిమా ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నైట్ పార్టీకి వెళ్లారు హీరోయిన్ జాన్వీ అలాగే హీరో సిద్ధార్థ్. ఈ సందర్భంగా ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా కనిపించారు. మొన్న తిరుమలలో మెరిసిన ఈ జంట.. ఇప్పుడు నైట్ పార్టీకి కూడా వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్లిక్

Read More: ఆ హీరోయిన్ తో డేటింగ్... హీరో రామ్ సీక్రెట్ లీక్!

Next Story