- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇవి ఎల్లప్పుడూ నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి’.. బాలీవుడ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె దివంగత స్టార్ సీనియర్ నటి శ్రీదేవి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ధడక్ అనే హిందీ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్, అంగ్రేజీ మీడియం, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, తేరీ బాతోన్ మే ఐసా జియా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలాజ్ వంటి సినిమాల్లో నటించి.. ఈ హీరోయిన్ ప్రేక్షుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
పింక్ విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డులు, జీ సినీ అవార్డులు, లోక్‌మత్ స్టైలిష్ అవార్డులు, బాలీవుడ్ హంగామా స్టైల్ చిహ్నాలు, పింక్ విల్లా స్క్రీన్ అండ్ ఐకాన్స్ అవార్డులు వంటివి సొంతం చేసుకుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో విమర్శలు ఎదుర్కోన్న తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది. ‘చుట్టమల్లె చుట్టేశావే’ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బాలీవుడ్ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. స్టన్నింగ్ ఫొటోలు పంచుకుని.. ‘‘తాజాగా కత్తిరించిన బ్యాంగ్స్ ఎల్లప్పుడూ నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి’’ అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.






