Janhvi Kapoor: అప్పటినుంచే ప్రేమిస్తున్నానంటూ జాన్వీ కపూర్ పోస్ట్.. నెట్టింట వైరలవుతోన్న ఫొటోలు

by Kodari Anjali |

దివంగత శ్రీదేవి డాటర్.. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Janhvi Kapoor: అప్పటినుంచే ప్రేమిస్తున్నానంటూ జాన్వీ కపూర్ పోస్ట్.. నెట్టింట వైరలవుతోన్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత శ్రీదేవి డాటర్.. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2018 లో ధడక్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తల్లికి తగ్గ కుమార్తెగా పేరు సంపాదించుకుంది. రొమాంటిక్ డ్రామా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. తర్వాత గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్‌లో టైటిల్ ఏవియేటర్ పాత్ర పోషించినందుకు.. మిలి సినిమాలో ఫ్రీజర్‌లో చిక్కుకున్న మహిళ పాత్రకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేషన్లు అందుకుంది.

ఇక గత ఏడాది ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన అవకాశం కొట్టేసిన జాన్వీ కపూర్ దేవర చిత్రంలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘చుట్టమల్లె సాంగ్’ కు అయితే భారీ రెస్పాన్స్ లభించిందని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా పరమ్ సుందరి చిత్రంలో నటిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో జతకట్టిన ఈ సినిమా నుంచి ఇటీవలే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. టీజర్ వీక్షించిన నెటిజన్లు సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘పర్దేసియా, అప్పటి నుంచి నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే పరమ్ సుందరి సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుందని పంచుకుంది.

Next Story