Janhvi Kapoor: లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో జాన్వీ కపూర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్ట్

by Chukka Sudharani |

బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 2018లో ‘ధడక్’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Janhvi Kapoor: లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో జాన్వీ కపూర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 2018లో ‘ధడక్’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన నటన, అందంతో ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. అనతికాలంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని ప్రజెంట్ వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక ‘దేవర’ (Devara) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ప్రజెంట్ రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ సినిమాలో నటిస్తుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అలాగే.. ‘దేవర పార్ట్ 2’లో నటిస్తుంది ఈ బాలావుడ్ బ్యూటీ. ఇదే కాకుండా.. రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలో కూడా చాన్స్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

ఇలా తెలుగు, హిందీ అని తేడా లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ (Lady oriented) చిత్రంపై కూడా ఫోకస్ పెట్టిందట. ఈ సినిమాతో జాన్వీ తమిళం(Tamil)లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇదొక వెబ్ సిరీస్ అని తెలుస్తుండగా.. పా రంజిత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నట్లు టాక్. ఈ వెబ్ సిరీస్ ఈ జూలై నుంచే ప్రారంభం కానుందని తమిళ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుండగా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) రానున్నట్లు టాక్. ఇక జాన్వీ తమిళ ఎంట్రీకి కూడా సిద్ధం అవుతుందనే వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




Next Story