బుచ్చిబాబు పెద్ద రౌడీ...జాన్వీ క‌పూర్ షాకింగ్ కామెంట్స్‌

by velandi.Saikiran |

దర్శకుడు బుచ్చిబాబు పెద్ద రౌడీ అంటూ షాకింగ్ కామెంట్స్‌ చేశారు జాన్వీ క‌పూర్.

బుచ్చిబాబు పెద్ద రౌడీ...జాన్వీ క‌పూర్ షాకింగ్ కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ మెరుగనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా.. ప్రమోషన్స్ పై చిత్ర బృందం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ ముంబై వేదికగా స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ క్ర‌మంలో హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు బుచ్చిబాబు పెద్ద రౌడీ అంటూ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. సినిమా కోసం చాలా కసిగా పని చేస్తాడని.. ఎంతకైనా తెగిస్తాడని వెల్లడించారు. చూడడానికి అమాయకంగా ఉంటాడు కానీ.. చాలా డేంజర్ అన్నారు. అయితే షూటింగ్ జరిగేటప్పుడు మాత్రం అతని రౌడీయిజం బయటపడదని.. ఒక ఫ్రెండ్ లాగా అందరినీ ట్రీట్ చేస్తాడని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.

తాను ముంబైలో ఉంటున్నప్పటికీ సొంతిల్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగుపై ప్రేమను చూపారు. ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు చేసి తెలుగు వారందరినీ ఆకట్టుకుంటానని పేర్కొన్నారు. కాగా ఈ ఈవెంట్ లో గాయంతో మెరిసారు రామ్ చ‌ర‌ణ్‌. ఈ సీన్ చేస్తుండ‌గా చ‌ర‌ణ్ కు గాయం అయింద‌ని స్వ‌యంగా అయ‌నే చెప్పారు. ఇక ఈ పెద్ది సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ కానుంది.

Next Story