పవన్ కల్యాణ్ నోట వింటుంటే వినసొంపుగా ఉంది.. ‘HHVM’ పాటపై జనసేన నేత రియాక్షన్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-15 17:38:14  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రమైన హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu Movie) నుంచి ఇవాళ ఫస్ట్ సింగిల్ విడుదలైంది.

పవన్ కల్యాణ్ నోట వింటుంటే వినసొంపుగా ఉంది.. ‘HHVM’ పాటపై జనసేన నేత రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రమైన హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu Movie) నుంచి ఇవాళ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘వీరమల్లు చెబితే మాట వినాలి’ అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకర్షిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇక తాజాగా ఈ పాటపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetti Satyanarayana) స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘చాలా రోజుల తర్వాత ఒక చక్కటి పాట. కీరవాణి సంగీతంలో పవన్ కల్యాణ్ పాడుతుంటే వినసొంపుగా ఉంది. ఎవరి నోట చూసినా ఇప్పుడిదే వినిపిస్తోంది. సాహిత్యం కూడా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేదిగా ఉంది’ అని బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం(AM Rathnam) అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Video Link

Next Story