- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదే నిజమైతే తెలుగులో "జన నాయకుడు" పరిస్థితి ఏంటి?
తమిళ సూపర్‌స్టార్ థలపతి విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ తన చివరి సినిమా..

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్‌స్టార్ థలపతి విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ తన చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ క్యారెక్టర్ ఫుల్ జోష్‌గా ఉండబోతోందని సినీ వర్గాల్లో హాట్ టాక్ నడుస్తోంది. ఇది టాలీవుడ్ హిట్ ‘భగవంత్ కేసరి’ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమని తెలుస్తోంది. అందుకే తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తమిళంలో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. కాబట్టి అక్కడ ప్రీ-రిలీజ్ బిజినెస్ సూపర్ హైలెవల్‌లో సాగుతోంది. అదే ధీమ్‌తో తెలుగులో ‘జననాయకుడు’ అనే టైటిల్‌తో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ తెలుగు రైట్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారని టాక్ వినిపించింది.
కానీ తెలుగులో అంచనాలకు తగ్గట్టు బజ్ రాకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు సినీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. దీంతో తెలుగు ఈ సినిమా విడుదలవుతుందా లేదా అన్న సందిగ్ధం ఏర్పడింది. పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన మ్యూజిక్ సమకూరుస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కింది.






