విజయ్‌ 'జన నాయకుడు' కు బిగ్ షాక్‌..టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్న ఫ్యాన్స్ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-05 08:00:22  IST  )

బాలయ్య నటించిన భగవంత కేసరి సినిమాకు జన నాయకుడు రీమేక్ గా వస్తున్నట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుకింగ్ చేసుకున్న చాలా మంది సినిమా ప్రియులు..టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారట.

విజయ్‌ జన నాయకుడు కు బిగ్ షాక్‌..టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్న ఫ్యాన్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా 'జన నాయకుడు'. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా చాలామంది టికెట్లు కూడా కొనుగోలు చేశారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి అనుమానాలు మొదలయ్యాయి. బాలయ్య నటించిన భగవంత కేసరి సినిమాకు జన నాయకుడు రీమేక్ గా వస్తున్నట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుకింగ్ చేసుకున్న చాలా మంది సినిమా ప్రియులు..టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారట.

చూసిన సినిమానే మళ్లీ ఎందుకు చూడట‌మని, క్యాన్సిల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే 'జన నాయకుడు' చిత్ర బృందం మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తోంది. కొంతమంది విజయ్ సినిమాను ఆడకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అవుతోంది. కాగా 'జన నాయకుడు' సినిమాలో మాజీ మిలటరీ అధికారిగా కనిపించనున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా మెరువనున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపిస్తారు. అటు విజయ్ కెరీర్ లో ఇదే చివరి సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నాడు.

Read More..

విజ‌య్ ఎఫెక్ట్‌.. ఓటీటీలో దూసుకెళుతోన్న‌ 'భగవంత్ కేసరి'

Next Story